WNP: జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రవేట్ విద్యా సంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలిసిన, చూసిన వారు యాంటీ ర్యాగింగ్ కమిటీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు, కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సూచించారు.