పశ్చిమబెంగాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని గుర్తుతెలియని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు. ఓ డ్రెయిన్లో రక్తపుమడుగులో బాలికను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.