TPT: మదనపల్లికి చెందిన పూజారి నరసరాజు కుమారుడు జగదీష్ మతిస్థిమితం కోల్పోయి గత నెల 21వ తేదీన తప్పిపోయిన ఘటన సుఖాంతం అయింది. రేణిగుంట రైల్వే స్టేషన్లో అతన్ని గుర్తించిన హైకోర్టు అడ్వకేట్ మునిరెడ్డి సమాచారంతో సర్పంచ్ నగేశం అభయ క్షేత్రంలో ఆశ్రయం కల్పించారు. మతిస్థిమితం లేని యువకుడి తండ్రి నరసరాజు రావడంతో నిర్వాహకురాలు తస్లీమా బేగం అప్పగించారు.