మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భద్రత కరువైంది. జనరల్ ఆస్పత్రిలో 36 సీసీ కెమెరాలు ఉండగా అందులో కేవలం 10 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇటీవల జనరల్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున చోరీ ఘటనలతో పాటు పేషంట్ కేర్లకు సిబ్బందికి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా సీసీ కెమెరా వైర్లు కట్ చేసినట్టు సమాచారం.