GNTR: తాడేపల్లి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం లెక్కల ప్రకారం, బ్యారేజీలోకి 68,623 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే మొత్తంలో నీటిని దిగువకు, వివిధ కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. ప్రవాహం మరింతగా పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.