NLG: కుక్కడం సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.