SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో నిండుకుండలా కళకళలాడుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 45 టీఎంసీలు కాగా శనివారం రాత్రి వరకు 44.898 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 35,257 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్ట్ నుంచి 56,345 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.