అన్నమయ్య: ఈనెల 13న మదనపల్లె టమోటా మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇదే నేపథ్యంలో పలమనేరు పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ సంబంధిత పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.