NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఇవాళ ఉదయం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.