ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్ వద్ద ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఎస్సై అరోన్ వాహనాలను తనిఖీ చేసి కొందరికి జరిమానాలు విధించారు. ఈ మేరకు పెండింగ్ చలానాలు పరిశీలించి పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఆకతాయిలు వాహనాలను అతివేగంగా నడిపితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.