విశాఖ నగరంలో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులు విమర్శలకు గురవుతున్నాయి. డివైడర్లకు అమర్చిన గ్రిల్స్ నాసిరకంగా ఉండటంతో తాకితే కదిలిపోతున్నాయి. ప్రజా ధనం వృథా అవుతుందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.