KRNL: ఇటీవలి వర్షాలతో ఆదోని లక్ష్మమ్మ నగర్లో రోడ్లు గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యపై స్పందించిన టీడీపీ మాజీ ఇంఛార్జ్ గుడిసె కృష్ణమ్మ స్వయంగా వచ్చి జేసీబీ సాయంతో రోడ్లను సరిచేయించి, చెత్తాచెదారం తొలగింపజేశారు. కాలనీవాసులు ఆమె వేగవంతమైన చర్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.