AKP: పరవాడలో భూముల రీ సర్వే పూర్తి చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పైల రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి గ్రీవెన్స్ నిర్వహించారు. మల్లోడు గెడ్డలోకి వదులుతున్న ఫార్మా వ్యర్థ జలాలను అరికట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాబ్జి హామీ ఇచ్చారు.