GNTR: తుళ్లూరు(M) మల్కాపురం కోనేరు అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కోనేరు అభివృద్ధికి నోచుకోకపోవడంతో పాటు, చెత్త, చెదారంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోనేరు అభివృద్ధి చేయాలని వార్తలు రాగా ఆ సమయంలో ఢిల్లీ నుంచి ఓ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పరిశీలించి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.