ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఈనెల 12న చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ పోస్టర్లను మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైకాపా సమన్వయకర్త తలారి రంగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.