KDP: సిద్దవటం మండలంలోని మాచుపల్లిలో అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా జరిగింది. ఈ మేరకు గురు స్వామి శేఖర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ పూజలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ప్రతి ఏడాది మాచుపల్లిలో అయ్యప్ప మాల ధరించే భక్తుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి భాస్కర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.