NDL: మహానంది దేవస్థానంలోని కోనేరుల వద్ద భక్తులకు భద్రత కరవైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. గతంలో చోరీల నివారణకు షిఫ్టుల వారీగా 8 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించేవారు. అయితే, ప్రస్తుతం వేతనాల భారం పేరుతో వారి సంఖ్యను ఒక్కరికి తగ్గించడంతో భద్రత ప్రశ్నార్థకమైందని భక్తులు అంటున్నారు.