NZB: భూమికోసం, భుక్తికోసం, దేశ విముక్తికోసం విప్లవోద్యమంలో అమరులైన వారి పోరాట స్ఫూర్తితోనే రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిచ్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మెంట్రాజ్పల్లిలో నిర్వహించిన అమరవీరుల స్మారక సభలో ఆయన మాట్లాడారు.