MBNR: జిల్లా బీసీ సేన అధ్యక్షులుగా బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన సుప్ప ప్రకాష్ నియామకమయ్యారు. పెద్దాయపల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన బీసీ సేన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుప్ప ప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లాలో బీసీలందరినీ ఏకం చేసి, రాజ్యాధికారం కోసం కృషి చేస్తానని తెలిపారు.