SRPT: నడిగూడెం మండలం నారాయణపురంలో ఆదివారం ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో వినియోగదారులకు ఉచితంగా పర్యావరణ రహిత సంచులు పంపిణీ చేశారు. రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యంతో పాటు, సంచులు అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ చల్లా జానయ్య, వినియోగదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.