BDK: ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో రైతులు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వినూత్న రీతిలో నిన్న నిరసన వ్యక్తం చేశారు. బొంబాయి తండాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఐఎంఎల్ నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ.. నవంబర్ 10వ తేదీన కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని తెలిపారు.