ELR: ద్వారకాతిరుమల (మం) గొల్లగూడెంలో శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు యువరాజ్‌పై వీధి కుక్క దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడిని కుక్క కరిచి గాయపరచడంతో, స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమికొట్టారు. గాయపడిన యువరాజ్‌ను భీమడోలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించిన్నట్లు తెలిపారు.