ప్రకాశం: PC పల్లి మండలం లింగన్నపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం పరిశీలించారు. సీఎం సభా ప్రాంగణం, పార్కింగ్ , బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్, అధికారులతో చర్చించారు. ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.