ELR: కుక్కునూరు మండలం సీతారామనగరం పరిధిలోని కిన్నెరసాని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను శనివారం సీజ్ చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం, బూర్గంపహాడ్ మండలానికి ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశామన్నారు.