BHPL: గోరికొత్తపల్లి మండలం చిన్నకోడేపాక గ్రామానికి చెందిన BRS గ్రామ కమిటీ అధ్యక్షుడు కోనూరు సదానందం బాబాయ్ కోనూరు సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం మృతుడి నివాసానికి వెళ్లి సాంబయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.