MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీపావళి ముగిసిన తర్వాత మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరవుతారని, వీక్షకులు కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని యాదవ సంఘ నాయకులు పిలుపునిచ్చారు.