HYD: నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జూలైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.