MBNR: చిన్నచింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. నారాయణపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆలయ ఈవో అనుమతి తీసుకుని ప్రత్యేక దర్శనం కోసం ప్రయత్నం చేస్తూ స్వామి వారి మెట్ల గుండా వెళ్తున్నారు. కాగా అదే సమయంలో దారిలో కట్టెలు అడ్డు వేయడంతో గుత్తేదారుకు, భక్తులకు గొడవ జరిగింది. గోడవ నేపథ్యంలో అక్కడే లడ్డూ అమ్ముతున్న సిబ్బంది భక్తుడిపై దాడి చేశారు.