KRNL: నందవరం మండలం ముగతి గ్రామంలో శనివారం రాత్రి ఎస్సై తిమ్మారెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జగ్రత్త వహించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు.