గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలోని ఆర్డీటీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంటిని అద్దెకు తీసుకున్న రేణుక శివశంకర్ దంపతులు, శనివారం సాయంత్రం ఇంటి గేటు ముందు ఒక బొమ్మపై పసుపు, కుంకుమ పడి ఉండడాన్ని చూసి భయపడ్డారు. గత నెల 28న ఇదే ఇంట్లో దొంగతనం జరిగినట్లు బాధితులు తెలిపారు.