MDK: పదవ తరగతి పరీక్ష ఫీజును ఈనెల 13వ తేదీ వరకు విద్యార్థులు చెల్లించాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు 14వ తేదీలోపు ఆన్లైన్ ఫీజులు నమోదు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల డేటాను 18వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.