AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల క్యాంపుకు వెళ్లనున్నారు. ఉదయం 10:50 గంటలకు ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి వెళ్తారు. ఈ నేపథ్యంలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని, గజారామాన్ని, నగరవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.