NTR: విజయవాడలో కల్తీ మాంసం అమ్మకాలు ఇష్టారీతిగా జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన, రోగాల బారిన పడిన గొర్రెలను కోసి అమ్ముతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెటర్నరీ పరీక్షలు లేకుండానే వ్యాపారులు జీవాలను కోయడం, కబేళాలో ముద్రలు సైతం వేయించుకోకపోవడంపై ప్రజారోగ్యానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.