TG: BRS అధినేత KCR జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు దూరంగా ఉండటంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో కూడా దూరంగా ఉన్నారు. అక్కడ తక్కువ మెజార్టీతో పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. KCR ప్రచారానికి వచ్చి ఉంటే BRS గెలిచేదని గుర్తుచేసుకున్నారు. నాడు అతి విశ్వాసంతోనే ప్రచారానికి రాలేదని ప్రచారం జరిగింది. నేడు అదే సీన్ రిపీట్ అవుతుందా? అని ఆలోచనలో పడ్డారు.