టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికా-Aతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ జురెల్ (127*) సెంచరీతో చెలరేగాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ 132* పరుగులు సాధించాడు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 382-7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.