KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఆదినగేశ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి అభివృద్ధికి తన వంతు అంకితభావంతో పని చేస్తానన్నారు. ఆసుపత్రిలో రోగులకు అన్ని విధాలా ఆరోగ్య సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. ఆయనకు వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.