ఆస్ట్రేలియాతో ఇవాళ జరగనున్న 5వ T20లో జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ తీస్తే.. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అలాగే అన్ని ఫార్మాట్లలోనూ 100 వికెట్లు తీసిన ప్లేయర్‌గానూ నిలుస్తాడు. ఇప్పటివరకు మలింగ, షాహిన్ అఫ్రిది, షకిబ్ అల్ హసన్ మాత్రమే 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టారు.