KMM: మెప్మా సీవోను సస్పెన్షన్ చేస్తూ పీడీ నళిని పద్మావతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం KMC పరిధిలో మెప్మా సీవోగా విధులు నిర్వర్తిస్తున్న రోజాపై కొందరు CRPలు, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో అదనపు కలెక్టర్ పి.శ్రీజ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. విచారణ అనంతరం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీవోను సస్పెన్షన్ చేసినట్లు తెలిసింది.