AP: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో కియోస్క్‌లను ఏర్పాటు చేయనుంది. టచ్ స్క్రీన్ ఉండే వీటి ద్వారా భక్తుల దర్శనం, వివిధ సేవల టికెట్లు నేరుగా పొందొచ్చు. ఎన్ని టికెట్లు కావాలో నమోదు చేసి డిజిటల్ చెల్లింపు చేస్తే వెంటనే టికెట్లు జారీ చేస్తుంది. కరూర్ వైశ్యా బ్యాంక్ కార్పొరేషన్ ఈ కియోస్క్ మెషిన్లను అందిస్తోంది.