GNTR: నవంబర్ 21వ తేదీ నుంచి రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో ముఖ్యంగా రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు పనులు మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు.