GDWL: టాలెంట్ టెస్ట్‌లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ ఉచిత విద్యను కార్పొరేట్ కళాశాలలో అందించడం జరుగుతుందని ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఆదివారం గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.