KNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమం కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఇవాళ సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో వారు మౌనదీక్ష చేపట్టారు. రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు ఏకధాటిగా ఉండాలన్నారు.