W.G: ఆచంట వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాల మేరకు ఏ.వేమవరం వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడిగా దొంగ ఉపేంద్ర ఆదివారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉపేంద్రను నాయకులు అభినందించారు. గ్రామంలో యువజన విభాగాన్ని బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని ఉపేంద్ర స్పష్టం చేశారు.