AP: భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కనకదాసు విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై కనకదాసు సేవలను కొనియాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.