MBNR: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్- 14, అండర్- 17 బాల, బాలికల ఖోఖో జట్ల ఎంపికలను డీఎస్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డా. శారదాబాయి తెలిపారు. ఈనెల 10న అండర్- 14, 11న అండర్- 17 ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలలోపు పీడీ మొగులాల్ (9985905158)ను సంప్రదించాలని సూచించారు.