JGL: మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అనుమల్ల గంగాధర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 4న గంగాధర్ భీమారం నుంచి కొండాపూర్ వైపు ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన గంగాధర్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.