SRD: అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన అమీన్పూర్లో చోటు చేసుకుంది. పట్టణంలోని KSR కాలనీలో కృష్ణవేణి, బ్రహ్మయ్య భార్య, భర్తలు నివాసం ఉంటున్నారు. భార్య కృష్ణవేణి కోహిర్ డీసీసీబీ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. గత కొంతకాలంగా బ్రహ్మయ్య భార్య కృష్ణవేణిపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం ఈ విషయమే ఇద్దరి మధ్య గొడవ చెలరేగి బ్యాట్‌తో కొట్టి చంపాడు.