HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నవంబర్ 11న ఉప ఎన్నిక కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ సెలవు కేవలం ఆ నియోజకవర్గానికే వర్తిస్తుంది. హైదరాబాద్ జిల్లా సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయన్నారు.