సత్యసాయి: గుడిబండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలోకి చేరారు. మడకశిర పట్టణం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో వారందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో రంగస్వామి, మురళీధర్, తదితరులు ఉన్నారు.