AP: పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) బృందం పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటిస్తోంది. డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులను బృందం సభ్యులు పరిశీస్తున్నారు. ప్రాజెక్టు అథారిటీ సీఈవో అతుల్ జైన్ ఆధ్వర్యంలో డ్యామ్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు యొక్క తాజా పరిణామాలను పరిశీలించి, వివిధ అంశాలపై బృందం సభ్యులు సమీక్షించనున్నారు.